టోకు ధరల సూచీ కూడా..

Fri,March 15, 2019 12:36 AM

WPI inflation rises to 2 93 percent in February

ఫిబ్రవరిలో 2.93 శాతానికి ఎగబాకిన సూచీ
న్యూఢిల్లీ, మార్చి 14: టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం కూడా ఎగిసింది. పలు ఆహార పదార్థాలు భగ్గుమనడంతో ఫిబ్రవరి నెలకు గాను టోకు ధరల సూచీ 2.93 శాతానికి చేరుకున్నదని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. కూరగాయలు, చిరుధాన్యాలు మరింత ప్రియమయ్యాయని నివేదికలో పేర్కొంది. జనవరిలో 2.76 శాతంగా ఉన్న ధరల సూచీ..అంతక్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 2.74 శాతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో వచ్చే నెలలో రిజర్వు బ్యాంక్ ప్రకటించనున్న పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు మెరుగుపడ్డాయి. కాగా, తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం ఆహార ధరల సూచీ 4.28 శాతానికి ఎగిసింది. గతేడాది ఇదే నెలలో ఇది 2.34 శాతంగా ఉన్నది. నెలవారి ఆధారంగా చిరుధాన్యాలు, వరి, గోధుమ, పప్పు దినుసులు, కూరగాయలు, పండ్లు, ఇతర ప్రోటిన్ ఆధారిత ఉత్పత్తులైన కోడిగుడ్లు, మాంసం, చేపలు మరింత ప్రియమయ్యాయి.

కానీ పాల ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. ఇంధ నం, విద్యుత్ విభాగాలు సూచీ రెండు శాతానికి పైగా పెరిగాయి. డిసెంబర్ 2018 నెలకుగాను గతంలో విడుదలైన టోకు ధరల సూచీని 3.8 శాతానికి బదులుగా 3.46 శాతానికి కుదించింది. రిటైల్, టోకు ద్రవ్యోల్బణ గణాంకాలు ఎగువుముఖం పట్టడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రస్థాయిలో ప్రభావం పడే అవకాశాలున్నాయని కేర్ రేటింగ్ ఆందోళన వ్యక్తంచేసింది. ప్రాథమిక వస్తువులు, ఆహార, ఆహారేతర ఉత్పత్తుల ధరలు మరింత ప్రియంకావడంతో టోకు ధరల సూచీ మరింత పైకీ చేరుకున్నదని తెలిపింది. ఏప్రిల్ 2018 నుంచి ఫిబ్రవరి 2019 మధ్యకాలంలో సగటుగా 2.75 శాతంగా ఉన్నది. రిటైల్, టోకు ధరల సూచీలు ఎగువముఖం పట్టడంతో అందరి కళ్లు రిజర్వు బ్యాంక్‌పై పడింది.

483
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles