భారత్‌లో యుహో మొబైల్ ప్లాంట్!

Thu,April 18, 2019 12:22 AM

Yuho Mobiles eyes Gurugram Tirupati for second plant

హైదరాబాద్, ఏప్రిల్ 17: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ యుహో మొబైల్స్..భారత్‌లో మొబైల్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. రూ.100 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోతున్న ఈ ప్లాంట్‌ను గురుగ్రామ్ లేదా తిరుపతిలో నెలకొల్పే అవకాశం ఉన్నదని యుహో మొబైల్స్ డైరెక్టర్-సేల్‌స కేశవ్ అరోరా తెలిపారు. ఇప్పటికే సంస్థకు గురగ్రామ్‌లో ఎస్‌కేడీ (సెమి నాక్డ్ డౌన్) యూనిట్‌లో 500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. భారత్‌లో మొబైళ్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇక్కడే అసెంబ్లింగ్ యూనిట్‌ను నెలకొల్పాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.

ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేసేదానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, ఆయా రాష్ర్టాలు ఇస్తున్న రాయితీల ఆధారంగా వచ్చే రెండు నుంచి మూడు నెలల్లో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఉత్పత్తిని ప్రారంభించనున్న నూతన ప్లాంట్ ద్వారా 500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నయన్నారు. ప్రస్తు తం సంస్థ రూ.6 వేల నుంచి రూ.9,500 లోపు ధర కలిగిన ఆరు మొబైళ్లను దేశవ్యాప్తంగా విక్రయిస్తుండగా, డిసెంబర్ నాటికి మరో ఎనిమిది మోడళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు.

1653
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles