541 మందిని తీసేసిన జొమాటొ

Sun,September 8, 2019 02:58 AM

Zomato lays off 541 direct employees

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటొ 541 మందిని తొలగించినట్లు శనివారం ప్రకటించింది. సంస్థ ఉద్యోగుల్లో ఇది 10 శాతం కావడం గమనార్హం. కస్టమర్, మర్చంట్, డెలివరీ భాగస్వామ్య మద్దతు బృందాలు తదితర విభాగాల్లో ఈ కోతలు జరిగాయి. కాగా, కృత్రిమ మేధస్సు (ఏఐ)తో జొమాటొను ఆధునికీకరించారు. ఈ ఆటోమేషన్ వల్లే 541 ఉద్యోగాలు పోయాయి. మరోవైపు ఈ నిర్ణయం బాధాకరమైనా.. సీనియారిటీ ప్రకారం రెండు నెలల జీతం, వచ్చే ఏడాది జనవరి ఆఖరుదాకా పలు ప్రయోజనాలను ఉద్యోగాలు కోల్పోయినవారికి అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.

542
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles