ఏబీసీడీ నాన్నకు అంకితం


Tue,May 14, 2019 11:15 PM

ABCD Movie Pre Release Event

కెరీర్‌కు సంబంధించిన ఏబీసీడీలను శిరీష్ ఎప్పుడో ప్రారంభించాడు. స్టార్‌డమ్‌కు సంబంధించిన ఏబీసీడీలు ఈ సినిమాతో మొదలుపెట్టాలి అని అన్నారు హీరో నాని.అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్ జంటగా నటిస్తున్న చిత్రం ఏబీసీడీ. అమెరికన్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ ఉపశీర్షిక. సంజీవ్‌రెడ్డి దర్శకుడు. సురేష్‌బాబు సమర్పణలో మధుర శ్రీధర్‌రెడ్డి, యష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 17న విడుదలకానుంది. సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హీరో నాని మాట్లాడుతూ ట్రైలర్ చూస్తుంటే నేను నటించిన పిల్ల జమీందార్ సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమాకు మించి పెద్ద విజయాన్ని సాధించాలి. మంచి సినిమా వస్తే ప్రోత్సహించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు నిర్మాత మధురశ్రీధర్. ఆయన కోసం ఓ బాధ్యతగా భావించి ఈ వేడుకకు వచ్చాను. సినిమా వ్యాపారం, నిర్మాణానికి సంబంధించి శిరీష్ రాసిన పలు ఆర్టికల్స్ చదివాను. తండ్రి దారిలో అడుగులు వేస్తూ నిర్మాతగా మారుతాడని అనుకున్నా. కానీ శిరీష్ హీరో అయ్యాడు అని అన్నారు. అల్లు శిరీష్ మాట్లాడుతూ ఏబీసీడీ సినిమా నా బాడీలాంగ్వేజ్‌కు సరిపోతుందని, ఇందులో నటించమని రామ్‌చరణ్ సూచించాడు. నా వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉండే కథ ఇది. హీరో పాత్రలో నన్ను నేను చూసుకున్నాను. సినిమాలో హీరో తండ్రి పాత్రను చూడగానే మా నాన్న గుర్తొచ్చారు.

నిజజీవితంలో నేను డబ్బు విలువను నాన్న ద్వారా తెలుసుకున్నాను. ఈ సినిమాను మా నాన్నకు అంకితం ఇస్తున్నాను. సినిమాలో నా పాత్ర పేరు అరవింద్ ప్రసాద్. మా నాన్నను స్ఫూర్తి తీసుకొనే ఆ పేరు పెట్టాం. చదువుకునే సమయంలో నేను పడిన కష్టాలన్నీ ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు గుర్తొచ్చాయి. నటుడిగా నన్ను కొత్త పంథాలో ఆవిష్కరిస్తుంది అని చెప్పారు. బీవీఎస్వ్రి, పవన్‌సాధినేని, వాసువర్మ, కృష్ణచైతన్య, సుధీర్‌వర్మ సీక్రెట్ సూపర్ హీరోస్ మాదిరిగా ఈ సినిమా రూపకల్పనతో తనకు చక్కటి సహకారాన్ని అందించారని, కొత్తవాడినైనా తనను నమ్మి అవకాశమిచ్చిన నిర్మాతలకు, శిరీష్‌కు రుణపడి ఉంటానని దర్శకుడు సంజీవ్‌రెడ్డి చెప్పారు. శిరీష్ కెరీర్‌లో పెద్ద విజయంగా ఈ సినిమా నిలవాలని సురేష్‌బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మధురశ్రీధర్‌రెడ్డి, రుక్సార్ థిల్లాన్ తదితరులు పాల్గొన్నారు.

1311

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles