మిస్‌మ్యాచ్‌కు డేట్ కుదిరింది!

Sun,November 17, 2019 12:06 AM

ఉదయ్‌శంకర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న చిత్రం మిస్‌మ్యాచ్ విడుదలకు సిద్ధమైంది. ఎన్.వి నిర్మల్‌కుమార్ దర్శకత్వంలో జి.శ్రీరామరాజు, భరత్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విశేషాలను హీరో తెలియజేస్తూ ఆసక్తికరమైన కథ, కథనాలతో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాలను అలరిస్తుందనే నమ్మకం వుంది. కథానాయకుడిగా నాకు పూర్తి సంతృప్తినిచ్చిన చిత్రమిది అన్నారు. నేటి తరం ప్రేక్షకులు కోరుకుంటున్న అన్ని అంశాలు ఈ చిత్రంలో వున్నాయని, తప్పకుండా చిత్రం విజయం సాధిస్తుందనే విశ్వాసం వుందని నిర్మాతలు తెలిపారు.

408

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles