పరశురామ్ దర్శకత్వంలో..


Sun,August 25, 2019 11:49 PM

Akhil Akkineni next to be directed by Parasuram

యువహీరో అక్కినేని అఖిల్ కెరీర్‌లో మంచి కమర్షియల్ విజయం కోసం తపిస్తున్నారు. నటుడిగా ప్రతిభను నిరూపించుకున్నప్పటికి బాక్సాఫీస్ వద్ద ఆయన సినిమాలు ఆశించిన విజయాల్ని దక్కించుకోలేకపోయాయి. దీంతో ప్రస్తుతం కథాంశాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు అఖిల్. ప్రస్తుతం ఆయన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం అఖిల్ మరో సినిమా ఖరారైంది. ఈ చిత్రానికి గీత గోవిందం చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పరశురామ్ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ గురించి తెలుసుకున్న నాగార్జున అందులోని కొత్తదనం నచ్చడంతో ఓకే చేశారని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

605

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles