నా వయసుకు తగిన కథ ఇది!


Tue,August 6, 2019 12:55 AM

akkineni nagarjuna superb speech at manmadhudu 2 pre release event

ఆగస్ట్ నెలంటే నాకు చాలా ఇష్టం. ఈ మధ్యే బిగ్‌బాస్ మొదలుపెట్టాను. త్వరలో నా పుట్టినరోజు రాబోతుంది. ఈ సినిమాకు మన్మథుడు-2 అని టైటిల్ ఎందుకు పెట్టామంటే.. తొలి సినిమాలో నేను అమ్మాయిలను ద్వేషిస్తుంటా. కానీ ఇందులో మాత్రం ప్రేమిస్తుంటా అన్నారు నాగార్జున. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం మన్మథుడు-2. రాహుల్వ్రీంద్రన్ దర్శకుడు. నాగార్జున, కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. నాగార్జున మాట్లాడుతూ ఈ వయసులో ప్రేమకథ చేయడమేంటని అడుగుతున్నారు. ఏ వయసులోనైనా ప్రేమించవొచ్చు. ఈ అంశాన్ని తెలియజెప్పే సినిమా ఇది. సంవత్సరం క్రితం ఓ ఫ్రెంచి సినిమా చూశాను. నా వయసుకు తగిన కథ అనిపించింది. దర్శకుడు రాహుల్వ్రీంద్రన్ అద్భుతంగా తెరకెక్కించాడు.

పోర్చుగల్‌లో 40రోజులు షూటింగ్‌ను బాగా ఎంజాయ్ చేశాం. అందరూ నాకు ఇద్దరు పిల్లలున్నారు కదా అంటుంటారు. నాగచైతన్య, అఖిల్ నాకు బ్రదర్స్ అనుకుంటా (నవ్వుతూ). మన్మథుడు చిత్రం నాకు ఎన్నో మధురానుభూతులు మిగిల్చింది. మన్మథుడు-2 కూడా అందరిని అలరిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. నాన్న సినిమాల ప్రీరిలీజ్ వేడుకలకు రావాలంటే కొంచెం భయంగా అనిపిస్తున్నది. నాన్న, నేను, అఖిల్, ...మేం ముగ్గురం బ్రదర్స్‌లా ఉన్నామని అందరూ అంటుండేవారు. ఇప్పుడు నాన్న మాలాగే యూత్‌ఫుల్ కంటెంట్‌తో సినిమాలు చేస్తున్నారు. ఈ టైమ్‌లో నాన్న ప్రేమకథని చేయడం చాలా గ్రేట్. జయాపజయాలతో సంబంధం లేకుండా నాన్న విభిన్నకథలతో దూసుకుపోతున్నాడు. అందుకే ఆయన్ని అందరూ కింగ్ అంటారు. మాలాంటి వారందరికి నాన్నే స్ఫూర్తి.

భవిష్యత్తులో రాహుల్వ్రీంద్రన్‌తో సినిమా చేయాలని ఉంది అని నాగచైతన్య చెప్పారు. రాహుల్వ్రీంద్రన్ మాట్లాడుతూ నా మొదటి సినిమా రిలీజ్‌కు ముందు నాగార్జునగారు ఇంటికి పిలిచి మాట్లాడారు. నా టేకింగ్ బాగుందని మెచ్చుకున్నారు. ఓ ఫ్రెంచ్ సినిమా చూపించి ఈ సినిమాని నువ్వు డైరెక్ట్ చేయడం కరెక్ట్ అని చెప్పారు. నేను వెంటనే ఒప్పుకున్నాను అన్నారు. నాగార్జునతో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చిందని, సినిమాలో తాను పోషించిన అవంతిక పాత్ర అందరిని మెప్పిస్తుందని కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్ చెప్పింది. ఈ వేడుకకు మన్మథుడు చిత్ర దర్శకుడు విజయ్‌భాస్కర్, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

816

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles