అజిత్ దోవల్ పాత్రలో అక్షయ్‌కుమార్?


Wed,August 7, 2019 12:05 AM

Akshay Kumar as Ajith Doval

ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్రమోదికి జాతీయ భద్రతా సలహాదారుడుగా పనిచేస్తున్నారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అజిత్ దోవల్. ఇంటిలిజెన్స్, రక్షణ రంగంలో వ్యూహచతురుడిగా ఆయనకు పేరుంది. మిజోరాం, పంజాబ్ రాష్ర్ర్టాల్లో తలెత్తిన తిరుగుబాట్లను అణచివేయడంతో పాటు కాందహార్ హైజాక్ ఘటనలో బందీలను విడిపించే ఆపరేషన్‌లో అజిత్‌దోవల్ ప్రధాన భూమిక పోషించారు. తాజాగా కశ్మీర్ పరిణామాలకు సంబంధించిన ముందస్తు వ్యూహాల్ని, భద్రతాపరమైన చర్యల్ని ఆయనే పర్యవేక్షించారు. బాలాకోట్ వైమానిక దాడుల వ్యూహకర్త కూడా ఆయనే. భారత్ సాధిస్తున్న వరుస సైనిక విజయాల వెనక చోదక శక్తిగా అజిత్‌దోవల్ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన జీవిత చరిత్ర వెండితెర దృశ్యమానంకానుంది.
Ajit_Kumar
అజిత్‌దోవల్ పాత్రలో అక్షయ్‌కుమార్ నటించబోతున్నారు. ఈ చిత్రానికి నీరజ్‌పాండే దర్శకత్వం వహించబోతున్నారు. గతంలో అక్షయ్‌కుమార్-నీరజ్‌పాండే కాంబినేషన్‌లో స్పెషల్ ఛబ్బీస్, రుస్తుమ్, టాయ్‌లెట్-ఏక్‌ప్రేమ్ కథా చిత్రాలు రూపొందాయి. ప్రస్తుతం అజిత్‌దోవల్ బయోపిక్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌వర్క్ జరుగుతుందని, ఈ ఏడాది చివరలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కశ్మీర్ పరిణామాల వ్యూహకర్తగా పేరున్న అజిత్‌దోవల్ జీవిత కథ వెండితెరపై ఆవిష్కృతంకాబోతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

614
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles