జనవరి 12న ‘అల వైకుంఠపురములో’?

Mon,September 23, 2019 12:35 AM

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’. పూజాహెగ్డే కథానాయిక. అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ నిర్మాతలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. అల్లు అర్జున్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ‘ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌, ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ‘జులాయి’ ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ తర్వాత అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కలయికలో వస్తున్న మూడో చిత్రమిది కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సకుటుంబ కథా చిత్రమిది. హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలు, వినోదం కలబోతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. త్రివిక్రమ్‌ శైలి సంభాషణలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి’ అని చిత్రబృందం తెలిపింది. టబు, రాజేంద్రప్రసాద్‌, సచిన్‌ఖేడ్‌కర్‌, మురళీశర్మ, సముద్రఖని, జయరాం, సునీల్‌, నవదీప్‌, సుశాంత్‌, నివేథా పేతురాజ్‌, గోవిందా పద్మసూర్య, బ్రహ్మాజీ, హర్షవర్ధన్‌, రాహుల్‌ రామకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, సంగీతం: తమన్‌, ఎడిటర్‌: నవీన్‌నూలి, ఆర్ట్‌: ఏ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: పీడీవి ప్రసాద్‌, కథ, సంభాషణలు, దర్శకత్వం: త్రివిక్రమ్‌.

685

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles