పారిస్‌లో ఆటపాట

Sat,November 9, 2019 12:05 AM

పారిస్‌లో ప్రియురాలితో ప్రణయగీతాన్ని ఆలపిస్తున్నారు అల్లు అర్జున్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం అల వైకుంఠపురములో. త్రివిక్రమ్ దర్శకుడు. పూజాహెగ్డే కథానాయిక. అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సామజవరగమన పాటను పారిస్‌లో అల్లు అర్జున్, పూజాహెగ్డేలపై చిత్రీకరిస్తున్నారు. శేఖర్‌మాస్టర్ నృత్యాలను అందిస్తున్నారు. దక్షిణాదిలో అత్యధిక మంది వీక్షించిన పాటగా సామజవరగమన కొత్త రికార్డులను సృష్టిస్తున్నది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం, తమన్ బాణీలు అలరిస్తున్నాయి. పారిస్‌లోని అందమైన ప్రదేశాల్లో ఈ పాటను చిత్రీకరిస్తున్నాం. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని చిత్రబృందం తెలిపింది. టబు, రాజేంద్రప్రసాద్, సచిన్‌ఖేడ్కర్, నవదీప్, సుశాంత్, నివేథా పెతురాజ్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం:పి.ఎస్. వినోద్.

654

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles