ఇరవై ఐదేళ్ల తర్వాత..


Mon,September 9, 2019 03:34 AM

Amitabh Bachchan Finds 25 Years of Hum Unbelievable

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్‌బచ్చన్ ఇరవై ఐదేళ్ల తర్వాత మరాఠీ చిత్రసీమలో పునరాగమనం చేస్తున్నారు. ఏబీ అండ్ సీడీ అనే చిత్రంలో కీలక పాత్రను పోషించనున్నారు. 1994లో రూపొందిన అక్క అనే మరాఠీ చిత్రంలో భార్య జయాబచ్చన్ సరసన అతిథి పాత్రను పోషించారు అమితాబ్‌బచ్చన్. పాతికేళ్ల అనంతరం మరాఠీలో ఏబీ అండ్ సీడీ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో తన నిజజీవిత పాత్రలోనే అమితాబ్‌బచ్చన్ కనిపించనున్నారు. వినోదప్రధాన కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో విక్రమ్ ఘోఖలే కీలక పాత్రను పోషిస్తున్నారు. మిలింద్ లేలే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

539

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles