రంగస్థలం తర్వాత ధోరణి మారింది!


Thu,August 8, 2019 11:04 PM

Anasuya Bharadwaj Trend changed after Rangasthalam

ఎంబీఏ పూర్తిచేసి వీఎఫ్‌ఎక్స్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో అనుకోకుండా ఈ రంగం వైపు అడుగులు పడ్డాయి. నేను ఏదీ ప్లాన్ చేసుకుని రాలేదు. హీరోయిన్ అవుతానని, నేను ప్రధాన పాత్రలో సినిమా చేస్తానని అస్సలు ఊహించలేదు అన్నారు అనసూయ. ఆమె నటిస్తున్న తాజా చిత్రం కథనం. రాజేష్ నాదెండ్ల దర్శకుడు. బి. నరేంద్రరెడ్డి, శర్మ చుక్కా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నేడు రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో అనసూయ పాత్రికేయులతో ముచ్చటించారు.

క్షణం తరువాత పదమూడు కథలు విన్నాను. అందులో ఏ ఒక్క స్కిప్ట్ నాకు సంతృప్తినివ్వలేదు. ఆ సమయంలో కథనం నాకెంతగానో నచ్చింది. నటిగా నన్ను నేను నిరూపించుకునే సినిమా అవుతుందనే నమ్మకం కలిగింది. అందుకే అంగీకరించాను. దర్శకురాలు కావాలనుకునే ఓ యువతి కథ నేపథ్యంలో సాగుతుంది. తను చెప్పిన కథ నచ్చి ఓ నిర్మాత అవకాశం ఇస్తాడు. ఆ తరువాత ఆ కథలో జరుగుతున్నట్టు నిజజీవితంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఆ విషయాన్ని ఆ యువతి పోలీసులకు వివరిస్తుంది. ఆ తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్నదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. తొలిసారి ఈ చిత్రంలో కథానాయికగా నటించాను. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఎలాంటి బాధ్యతలు వుండవు. కానీ హీరోయిన్ విషయం అలా కాదు. ఎంతో బాధ్యత వుంటుంది.

రంగస్థలం తరువాత..

రంగస్థలం విజయం తరువాత నా చుట్టూ వుండేవాళ్లు నన్ను చూసే ధోరణి మారింది. నా స్నేహితులు కొత్తగా చూడటం మొదలుపెట్టారు. దాంతో వాళ్లని పట్టించుకోవడం మానేశాను. సోషల్ మీడియా విషయంలో నా పంథాను మార్చుకున్నాను. గతంలో ప్రతి చిన్న విషయానికి స్పందించే దాన్ని కానీ ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆ విషయంలో చాలా ఓపికతో వ్యవహరిస్తున్నాను.

కొత్త టేకింగ్‌ని పరిచయం చేస్తుంది...

రంగస్థలంలో నా పాత్రకు పేరొస్తుందని ఊహించలేదు. అయితే ఆ సినిమా తరువాత నేను ఊహించిన స్థాయిలో నాకు అవకాశాలు రాలేదనడం కంటే నచ్చిన కథలు రాలేదు అనడం కరెక్టేమో. నా దగ్గరికి వచ్చిన కథలు బాగున్నా కథనం బాగా లేకపోవడంతో ఆ కథల్ని తిరస్కరించాను. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అవకాశాలు వచ్చాయి. అయితే ఇంకా ఏదీ అంగీకరించలేదు. తరుణ్‌భాస్కర్‌తో ఓ సినిమా చేస్తున్నాను. తెలుగు సినిమాకు సరికొత్త టేకింగ్‌ని, మేకింగ్‌ని పరిచయం చేస్తుందని గట్టి నమ్మకం వుంది.

873

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles