ముద్దుల గురించి పిల్లలకు తెలియదనుకోవడం అమాయకత్వం!


Thu,August 8, 2019 12:25 AM

Anchor Suma Interview with Akkineni Nagarjuna Manmadhudu2 Releasing on August 9th

కొత్త వాళ్లతో పనిచేసినప్పుడు నాలో కొత్తదనం కనిపిస్తుంది. ఆ విషయాన్ని శివ, గీతాంజలి చిత్రాలు నిరూపించాయి. నేను చేసిన సినిమాలన్నింటినీ ఒకసారి పరిశీలిస్తే తొలి, మలి చిత్ర దర్శకులే అత్యధికంగా కనిపిస్తారు. వాళ్లిచ్చిన కొత్త తరహా కథలవల్లే నేను సక్సెస్‌లు చూశాను.. స్టార్‌ని కాగలిగాను అన్నారు. నాగార్జున. కొత్తదనాన్ని, కొత్త వాళ్లని ప్రోత్సహిస్తూ తెలుగు తెరకు కొత్తతరహా చిత్రాల్ని అందించారాయన. నాగార్జున నటించిన తాజా చిత్రం మన్మథుడు-2 ఓ ఫ్రెంచ్ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో నాగార్జున బుధవారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి.

మన్మథుడు-2 విషయంలో కాన్ఫిడెంట్‌గా వున్నారా?

హార్డ్ వర్క్ చేశాం. ఎలా వుందనేది రేపు ప్రేక్షకులే చెప్పాలి.

ఫ్రెంచ్ సినిమాను రీమేక్ చేయాలని ఎందుకు అనిపించింది?

రోమ్-కామ్ సినిమా చేయాలని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను. ఆ సమయంలో ఓ ఫ్రెంచ్ చిత్రాన్ని చూశాను. అది నాకు టైలర్ మేడ్ సినిమా అవుతుందనిపించింది. అందులో ఫ్రెంచ్ సినిమాల్లో పాపులర్ అయిన నటుడు నటించారు. సినిమాలో హీరో నాలాగే మిడిల్ ఏజ్డ్. పైగా బ్యాచ్‌లర్. ఇందులో రొమాన్సే కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ వున్నాయి. ఓ మధ్య వయస్కుడు తన కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేశాడు?. తల్లి కోసం ఏం చేయడానికి సిద్ధపడ్డాడు? అనే అంశాలు నాకు బాగా నచ్చాయి. అలాంటి వ్యక్తి జీవితంలోకి తన కంటే చిన్న వయసుగల అమ్మాయి ఎలా ప్రవేశించింది? ఆ తరువాత అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నదే ఇందులో ఆసక్తికరం. ఈ అంశం నచ్చే సినిమా చేశాను.

సినిమాలో మీ వయసు గురించి మీరే పంచ్‌లు వేసుకున్నట్టున్నారు?

(నవ్వుతూ) మీరు పంచ్‌లు వేసేలోపు నేనే వేసుకుంటే బెటర్ కదా అనిపించింది.

సినిమాలో మీ పాత్ర లేటు వయసులో ప్రేమలో పడటానికి కారణం?

సినిమాలో నా పాత్రకు ముగ్గురు సిస్టర్స్, ఒక మదర్ వుంటుంది. ఈ నలుగురు నా పాత్రని అతిగాగారాబం చేయడం వల్ల ఆడవాళ్లకు దూరంగా వుండాలనుకుంటాడు. అలాంటి వ్యక్తి అవంతికని చూసి ప్రేమలో పడతాడు.

కథా నేపథ్యం మొత్తం పోర్చుగల్‌లోనే సాగడానికి ప్రత్యేకమైన కారణం ఏదైనా వుందా?

మన ఫోర్త్ జనరేషన్ గతంలో విజయనగరం తదితర ప్రాంతాల నుంచి మారిషస్, యూరప్ దేశాలకు వలస వెళ్లారు. అలా వెళ్లిన ఓ కుటుంబం పోర్చుగల్‌లో వుంటే ఎలా వుంటుందని ఆ నేపథ్యాన్ని ఈ సినిమా కోసం ఎంచుకోవడం జరిగింది. పోర్చుగీసు భాషని, నేపథ్యాన్ని సినిమాలో చూపిస్తే కొత్తగా వుంటుందని భావించాం. అంతే కాకుండా ఆ దేశంలో సినిమా చిత్రీకరణ చాలా సులువుగా చేసుకోవచ్చు. ఎలాంటి అభ్యంతరాలు, ఇబ్బందులు వుండవు. అక్కడ జనాభా కూడా చాలా తక్కువ.

ఇలాంటి కథ మన తెలుగులో తొలిసారి కదా?

ఇప్పటి వరకు ఇచ్చిన తెలుగు సినిమాల్లో ఇలాంటి కథతో వస్తున్న తొలి సినిమా ఇదే. ఇందులో నా పాత్రకు పెళ్లంటే ఇష్టం వుండదు. కానీ అతని తల్లి కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఇలాంటి కథ తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా వినోదాన్ని అందిస్తుందన్న నమ్మకముంది. ట్రైలర్‌లో మీరు చూసిన పంచ్ డైలాగ్‌లు చాలా తక్కువ. సినిమాలో అలాంటివి చాలా వున్నాయి.

మీ గత చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రంలో డైలాగ్స్ కుటుంబ ప్రేక్షకులకు ఇబ్బందికరంగా వున్నాయని సెన్సార్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసినట్టుది?

సినిమా అంతా పోర్చుగల్‌లో తీశాం. కొన్ని సన్నివేశాల్లో కొన్ని ఇబ్బందికరమైన డైలాగ్‌లు వున్నాయి. అయితే అవి సినిమాలో ఎవరు వాడారన్నది సినిమా చూసిన తరువాత మాట్లాడితే బాగుంటుంది.

మీ సినిమాల్లో వినిపించని డైలాగ్‌లు ఈ సినిమాలో వున్నట్టున్నాయి?

సినిమాలో పాత్రలని బట్టి డైలాగ్‌లు వున్నాయి. అన్నమయ్య సినిమా తరువాత స్వచ్ఛమైన తెలుగును ఈ చిత్రంలో మాట్లాడాను.

ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో మన్మథుడు సినిమాలోని పంచ్ డైలాగ్‌లన్నీ ఆ స్థాయిలో ఆకట్టుకున్నాయంటే దానికి కారణం దర్శకుడు విజయ భాస్కరే అన్నారు. కానీ ఆ సినిమా డైలాగ్‌లు రాసింది త్రివిక్రమ్ కదా?

నాకు కథ వినిపించింది విజయభాస్కర్. ఆ సినిమా సమయంలో నాతో రోజూ పంచ్‌లు వేసింది ఆయనే. అందుకే ఆయన పేరు చెప్పాను.

త్రివిక్రమ్ గురించి ఎందుకు చెప్పడం లేదు?

తరువాత ప్రశ్న అడగండి.

సినిమా తొలికాపీ చూసుకున్నారా? ఎలా అనిపించింది?

ఎవరేమనుకున్నా ఇదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కొంత మంది అంటున్నట్టు మన ముద్దుల గురించి పిల్లలకు తెలియదనుకోవడం మన అమాయకత్వం. ఈ సినిమాకు సెన్సార్ యు.ఎ ఇచ్చింది. ఐదుగురు మహిళల నేపథ్యంలో సాగే చక్కని కుటుంబ కథా చిత్రమిది. పూర్తి స్థాయి వినోదాత్మక పంథాలో చెప్పే ప్రయత్నం చేశాం.

యువ హీరోలంతా కొత్త తరహా చిత్రాలు చేస్తున్నారు. ఓ సినియర్ హీరోగా కొత్త కథల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా?

కొత్త కథల్ని ఎంచుకోవడం కష్టంగానే వుంది. ఆ విషయంలో కష్టపడుతున్నాను. ఇప్పడు కొత్త కథలు చేస్తేనే చూస్తున్నారు. లేదంటే చూడటం మానేస్తున్నారు.

గత మూడేళ్ల కాలంలో తెలుగు సినిమా స్వరూపమే మారిపోయింది. బడ్జెట్, మార్కెట్ స్థాయి పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ద్విభాషా చిత్రాలు చేసే ఆలోచన ఎందుకు చేయడం లేదు?

ఇప్పటి వరకు నాలుగు ద్విభాషా చిత్రాలు చేశాను. కానీ ఏవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. మన భాష, సంస్కృతి వేరు, తమిళ, మలయాళ సంస్కృతి వేరు. మనం పంచె కట్టే విధానం ఒకలా వుంటుంది. అదే కేరళలో అయితే మరోలా కడతారు. అందుకే ద్విభాషా చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. పరాజయాల వల్ల చాలా నేర్చుకున్నాను. అందుకే ఆ రోజుల్లో గీతాంజలి, శివ చిత్రాల్ని ఒకేసారి రెండు భాషల్లో చేయలేదు. ఊపిరి తెలుగులో చేసిన తరువాతే తమిళంలో చేశాం. ఈ విషయంలో నా మార్కెట్ స్థాయిని పెంచుకోవాలని ప్రయత్నించాను కానీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయాను.

మీలో ఎవరు కోటీశ్వరుడికి బిగ్‌బాస్‌కి మీరు గమనించిన తేడా?

మీలో ఎవరు కోటీశ్వరుడు షో ద్వరా చాలా మంది వ్యక్తుల కథలు తెలుసుకున్నాను. కానీ బిగ్‌బాస్ అలా కాదు. ఈ కార్యక్రమం వల్ల వారానికో కొత్త తరహా మనుషుల్ని చూస్తున్నాను. 15 మంది ఒకే హౌజ్‌లో గడపడం మామూలు విషయం కాదు. నేనయితే అలా గడిపే వాడిని కాదు.

అఖిల్ కెరీర్ ఇంకా దారిలోపడినట్టు లేదు?

చైతూ కెరీర్ కూడా కొన్ని సినిమాల తరువాతే దారిలోపడింది. దేనికైనా టైమ్ రావాలి.

968

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles