నిశ్శబ్దపు సమరం

Thu,November 7, 2019 12:25 AM

అనుష్క కథానాయికగా నటిస్తున్న చిత్రం నిశ్శబ్దం. టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. ఆర్. మాధవన్, అంజలి, షాలినిపాండే, మైఖేల్ మ్యాడ్‌సన్ కీలక పాత్రధారులు. అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదలచేశారు. తెలుగు టీజర్‌ను దర్శకుడు పూరి జగన్నాథ్, తమిళ, మలయాళ టీజర్‌ను దర్శకుడు గౌతమ్‌మీనన్, హిందీ టీజర్‌ను నీరజ్‌పాండే ఆవిష్కరించారు. అమెరికా నేపథ్యంలో సంభాషణలు లేకుండా హారర్, థ్రిల్లర్ అంశాలతో టీజర్ ఉత్కంఠను రేకెత్తిస్తున్నది. ఈ టీజర్‌లో సైగలతో తన భావాలను వ్యక్తపరుస్తూ అనుష్క వినూత్న ఆహార్యంతో ఆకట్టుకుంటున్నది. ఈ సినిమాలో ఆమె సాక్షి అనే మూగ చిత్రకారిణిగా నటిస్తున్నది. విహారయాత్ర ఓ జంట జీవితంలో ఎలా పీడకలగా మారిందనే పాయింట్‌తో ఈ చిత్రం రూపొందుతున్నది. క్రాస్ ఓవర్ కథాంశంతో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదలైన అనుష్క, మాధవన్, అంజలి ఫస్ట్‌లుక్‌లకు చక్కటి స్పందన లభిస్తున్నది. టీజర్‌తో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుతున్నాం. త్వరలో విడుదల తేదీని వెల్లడిస్తాం అని చిత్రబృందం తెలిపింది. సుబ్బరాజ్, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

395

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles