నిశ్శబ్దపు సాక్షి


Wed,September 11, 2019 10:47 PM

Anushka Shetty s first look from multilingual Nishabdam released

అనుష్క కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం నిశ్శబ్దం. హేమంత్ మధుకర్ దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుష్క ఫస్ట్‌లుక్‌ను బుధవారం చిత్రబృందం విడుదలచేసింది. ఈ ఫస్ట్‌లుక్‌లో బోర్డ్‌పై పెయింటింగ్ వేస్తూ షార్ట్ హెయిర్‌తో నలుపు దుస్తుల్లో అనుష్క వినూత్నంగా కనిపిస్తున్నది. ఈ సినిమాలో సాక్షి అనే పేరుగల మూగ చిత్రకారిణిగా ఆమె నటిస్తున్నట్లు చిత్రబృందం పేర్కొన్నది. ఈ ఫస్ట్‌లుక్‌కు తన చిత్రాలు మాట్లాడుతాయి కానీ ఆమె మాట్లాడలేదు అనే వ్యాఖ్యను చిత్రబృందం జోడించింది. క్రాస్ ఓవర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, ఆంగ్ల, మలయాళం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. మాధవన్, అంజలి, షాలినిపాండేతో పాటు హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్సన్ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. అమెరికాలో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

288

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles