ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా..

Sun,November 3, 2019 12:10 AM

సుజన్, తనిష్క్ జంటగా యు.కె.ఫిలింస్ పతాకంపై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణ రాజు నిర్మాతలుగా చలపతి పువ్వుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అప్పుడు ఇప్పుడు. ఇటీవల కళాతపస్వి కె.విశ్వనాథ్ చేతుల మీదుగా ఒక పాట విడుదల కాగా, మరో పాటను సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ తొలిపాటకు చక్కని స్పందన వస్తోంది. మరో పాటను రాఘవేంద్రరావు గారు విడుదల చేయడం సంతోషంగా వుంది. ఫీల్‌గుడ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా మెప్పిస్తుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అని తెలిపారు. శివాజీరాజా, శ్రీనివాస్ పేరుపురెడ్డి, మాధవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: పద్మారావ్ భరద్వాజ్.

202

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles