పాత్రికేయుడి సమరం

Fri,November 15, 2019 12:03 AM

అర్జున్ సురవరం ఓ నిజాయితీపరుడైన పాత్రికేయుడు. సమాజహితాన్ని కాంక్షించే అతడికి వృత్తినిర్వహణలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయో తెలియాలంటే సినిమా చూడాల్సిందే అంటున్నారు నిఖిల్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం అర్జున్ సురవరం. టి. సంతోష్ దర్శకుడు. రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మించారు. ఠాగూర్ మధు సమర్పకుడు. ఈ నెల 29న ఈ చిత్రం విడుదలకానుంది. నిర్మాత మాట్లాడుతూ శక్తివంతమైన కథ, కథనాలతో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. విద్యావ్యవస్థలో నెలకొన్న అవినీతిని వెలికితీసే క్రమంలో ఓ పాత్రికేయుడికి ఎదురైన పరిణామాలు ఉత్కంఠను పంచుతాయి.


టీజర్, పోస్టర్స్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది అని తెలిపారు. వెన్నెలకిషోర్, పోసాని కృష్ణమురళి, తరుణ్ ఆరోరా, నాగినీడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సామ్.సి.ఎస్, సినిమాటోగ్రఫీ:సూర్య.

204

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles