రామస్వామి బయోపిక్

Mon,November 4, 2019 12:07 AM

అల్తాఫ్, లావణ్యరెడ్డి, శాంతిరావు, సాత్వికజై నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం బట్టల రామస్వామి బయోపిక్కు. రామ్‌నారాయణ్ దర్శకుడు. సతీష్‌కుమార్.ఐ నిర్మాత. ఇటీవల హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వీరశంకర్ క్లాప్‌నివ్వగా, చంద్రమహేష్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ విడుదలచేశారు. నిర్మాత మాట్లాడుతూ వైవిధ్యమైన కథ, కథనాలతో తెరకెక్కుతున్న చిత్రమిది. బట్టల రామస్వామి జీవితకథేమిటన్నది తెరపై ఆసక్తిని పంచుతుంది. కమర్షియల్ హంగులతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. వచ్చే వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం అని తెలిపారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం: రామ్‌నారాయణ్.

287

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles