బీచ్‌రోడ్ చేతన్ కథ


Sun,September 8, 2019 07:56 AM

Beach Road Chetan Movie Teaser Launch

స్వీయనిర్మాణ దర్శకత్వంలో చేతన్ మద్దినేని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం బీచ్‌రోడ్ చేతన్. ఈ చిత్ర టీజర్‌ను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. చేతన్ మద్దినేని చిత్ర విశేషాలు తెలియజేస్తూ నేను నటించిన.. రోజులుమారాయి, ఫస్ట్‌ర్యాంక్ రాజు, గల్ఫ్ చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. అయితే వ్యక్తిగతంగా నాకు సరైన గుర్తింపురాలేదు. అందుకోసమే ఈ సినిమా చేశాను. బీచ్‌రోడ్‌లో తిరిగే ఓ యువకుడి కథ ఇది. యాక్షన్, సస్పెన్స్ అంశాల కలబోతగా సాగుతుంది. నేటి యువతకు బాగా కనెక్ట్ అవుతుంది. వైజాగ్‌లో చిత్రీకరణ జరిపాం అన్నారు. సినిమాలో తాను అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్ర చేస్తున్నానని, తన కెరీర్‌కు బ్రేక్‌నిచ్చే చిత్రమవుతుందని కథానాయిక తేజరెడ్డి చెప్పింది. ఈ చిత్రానికి కెమెరా: నిశాంత్‌రెడ్డి, సంగీతం: శామ్యుల్, మాటలు: చేతన్ మద్దినేని, నిర్మాత, దర్శకత్వం: చేతన్ మద్దినేని.

301

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles