సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో..

Sat,October 5, 2019 12:04 AM

రాక్షసుడు సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకున్నారు బెల్లంకొండ శ్రీనివాస్. నటుడిగా ఆయనకు ఈ చిత్రం మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత కథల ఎంపికలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్న శ్రీనివాస్ తాజాగా కొత్త చిత్రాన్ని అంగీకరించారు. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ కథాంశంతో ఈ చిత్రం రూపొందనున్నది. దర్శకుడు చెప్పిన కథలోని నవ్యత నచ్చడంతో శ్రీనివాస్ ఈ సినిమాను అంగీకరించారని చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాల్ని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
Srinivas-Bellamkonda

811

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles