మురికివాడలో ప్రేమకథ

Mon,September 30, 2019 12:02 AM

ప్రదీప్, మిథున జంటగా నటిస్తున్న చిత్రం భగత్‌సింగ్‌నగర్. వలజ క్రాంతి దర్శకుడు. వలజ గౌరి, రమేష్ ఉడత్తు నిర్మాతలు. శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్ర మోషన్‌పోస్టర్‌ను రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విడుదలచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మురికివాడలో జరిగే క్రైమ్ థ్రిల్లర్ కథ ఇది. కొత్త ఆలోచనలకు నాంది పలకాలి. భగత్‌సింగ్ 112వ జయంతి సందర్భంగా పోస్టర్‌ను విడుదలచేయడం ఆనందంగా ఉంది అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ప్రేమ, యాక్షన్, క్రైమ్, సెంటిమెంట్ హంగులతో ఉత్కంఠను పంచుతుంది అని చెప్పారు. మంచి సినిమాను నిర్మించామనే సంతృప్తిని మిగిల్చిందని నిర్మాతలు పేర్కొన్నారు.

257

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles