బ్రహ్మచారిపై వలపు మంత్రం

Wed,November 6, 2019 12:08 AM

పెళ్లి మీద సదభిప్రాయంలేని యువకుడతను. జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాలని కోరుకుంటాడు. సింగిల్‌లైఫ్‌లోనే కావాల్సినంత ఫన్ ఉంటుందన్నది అతడి విశ్వాసం. అతగాడికి ఓ చక్కని చుక్క పరిచయమవుతుంది. ఆమె వలపు మంత్రంలో సదరు బ్రహ్మచారి జీవితం ఎలాంటి మలుపులు తీసుకుందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు వెంకీ కుడుముల. ఆయన దర్శకత్వంలో నితిన్, రష్మికమందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం భీష్మ. సింగిల్ ఫరెవర్ ఉపశీర్షిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ నెల 7న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. ఇటీవలే రాజమండ్రి షెడ్యూల్‌లో కీలక ఘట్టాలను తెరకెక్కించాం. మరో రెండురోజుల్లో హైదరాబాద్ షెడ్యూల్ ఆరంభమవుతుంది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది అని నిర్మాత తెలిపారు. నరేష్, సంపత్, అనంత్‌నాగ్, జిషుసేన్‌గుప్తా, రఘుబాబు, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్, సంగీతం: మహతిస్వరసాగర్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వెంకీ కుడుముల.

502

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles