శత్రువు వేటలో చాణక్య

Sun,September 22, 2019 12:09 AM

గోపీచంద్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘చాణక్య’. తిరు దర్శకుడు. మెహరీన్‌ కథానాయిక. రామబ్రహ్మం సుంకర నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దసరా కానుకగా అక్టోబర్‌ 5న ప్రేక్షకులముందుకురానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఈ సినిమాలో గోపీచంద్‌ ఇండియన్‌ గూఢచార సంస్థ ఏజెంట్‌గా కనిపిస్తాడు. శత్రువుల నుంచి రహస్యాల్ని చాణక్య ఎలా సేకరించాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన క్లిష్ట పరిస్థితులు ఏమిటన్నది ఆసక్తిని పంచుతుంది. సస్పెన్స్‌, యాక్షన్‌ అంశాలతో ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌ నటి జరీన్‌ఖాన్‌ తెలుగు తెరకు పరిచయమవుతున్నది’ అన్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌, పాటలకు మంచి స్పందన లభిస్తున్నదని నిర్మాతలు తెలిపారు. సునీల్‌, నాజర్‌, జయప్రకాష్‌, రఘుబాబు, అలీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి, సంగీతం: విశాల్‌చంద్రశేఖర్‌, మాటలు: అబ్బూరి రవి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరు.

503

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles