చీమతో భామ ప్రేమ


Sun,August 25, 2019 11:11 PM

Cheema Prema Madhyalo Bhama Movie Ready To Release

సృష్టిలోని అల్పప్రాణి అయిన చీమ మనిషిగా మారాలని మనసు పడుతుంది? ఆ చీమ ప్రయత్నం సాధ్యమైందా? ఆ చీమకు ప్రేమ, శృంగారం తోడైతే ఏం జరిగిందనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం అని అంటున్నారు శ్రీకాంత్ శ్రీ అప్పలరాజు. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం చీమ-ప్రేమ మధ్యలో భామ. అమిత్, ఇందు జంటగా నటిస్తున్నారు. ఎస్.ఎన్. లక్ష్మీనారాయణ నిర్మిస్తున్నారు. ఫస్ట్ కాపీ సిద్ధమైంది. దర్శకుడు మాట్లాడుతూ ఓ యువ జంట ప్రేమ ప్రయాణానికి అందమైన దృశ్యరూపమిది. కుటుంబ విలువల, వినోదం అంశాల సమ్మిళితంగా ఉంటుంది అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ చీమ పాత్ర నేపథ్యంలో వచ్చే గ్రాఫిక్స్ అలరిస్తాయి. రవివర్మ బాణీలు, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, గీతా మాధురి అలపించిన పాటలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. సెన్సార్ పూర్తిచేసి సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేస్తాం అని అన్నారు. సుమన్, హరిత, పురంధర్ కీలక పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రవివర్మ, సినిమాటోగ్రాఫీ: ఆరిఫ్ లలాని.

445

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles