ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు!


Mon,February 11, 2019 12:27 AM

Dev Movie Pre Release Event In hyderabad

నేటి తరానికి సంబంధించిన కథలో నటించాలనే ఉద్దేశ్యంతో దేవ్ సినిమా చేశాను. ఈనాటి యువతకు బాగా కనెక్ట్ అయ్యే ఇతివృత్తమిది. స్నేహం, ప్రేమ అనే అంశాల చుట్టూ కథ నడుస్తుంది అన్నారు కార్తీ. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా తమిళ చిత్రం దేవ్. రజత్వ్రిశంకర్ దర్శకుడు. ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మాత. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో ఠాగూర్ మధు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 14న విడుదలకానుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక శనివారం జరిగింది. కార్తీ మాట్లాడుతూ భిన్న దృక్పథాలు కలిగిన ఓ ప్రేమజంట జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయన్నదే సినిమా కథ. హారిస్ జయరాజ్ సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుంది. సరికొత్త కథను ప్రేక్షకులకు అందించడం ఆనందంగా ఉంది అన్నారు. ఈ సినిమాలో కార్తీ పాత్ర ప్రతి ఒక్కరిలో పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. కుటుంబ అనుబంధాలు, ప్రేమ, యాక్షన్, అడ్వెంచర్ అంశాలు మేళవించిన విభిన్న కథా చిత్రమిది. తెలుగు ప్రేక్షకులకు నవ్యానుభూతిని కలిగిస్తుంది అని దర్శకుడు చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ కార్తీ, రకుల్ కాంబినేషన్ కన్నులపండువగా ఉంటుంది. పాటలు చక్కగా కుదిరాయి అన్నారు. సినిమాలో నేను మేఘన అనే స్వతంత్య్ర భావాలు కలిగిన అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. సినిమాలో అందరి హృదయాల్ని స్పృశించే భావోద్వేగాలుంటాయి అని రకుల్‌ప్రీత్‌సింగ్ చెప్పింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.

1932

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles