ఇస్మార్ట్ ధనుష్?


Sun,August 25, 2019 11:51 PM

Dhanush is likely to remake iSmart Shankar in Tamil

రామ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్. గత కొంత కాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న దర్శకుడు పూరి జగన్నాథ్‌కు తిరుగులేని సక్సెస్‌ని అందించింది. హీరో రామ్ కెరీర్‌లోనే భారీ వసూళ్లని సాధించిన ఈ చిత్ర తమిళ, హిందీ రీమేక్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. కాగా ఈ సినిమా తమిళ రీమేక్ హక్కుల్ని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సొంతం చేసుకుందని తెలిసింది. ఈ చిత్రం కోసం నిర్మాణ వర్గాలు హీరో ధనుష్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని, మాస్ ఫాలోయింగ్ వున్న ధనుష్ అయితేనే బాగుంటుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయట. ఇప్పటికే తెలుగు చిత్రాన్ని చూసిన ధనుష్ రీమేక్‌లో నటించడానికి సుముఖంగా వున్నారని తెలిసింది.

920

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles