పదిహేనేళ్ల కోరిక తీరింది..


Wed,September 11, 2019 11:36 PM

Dil Raju teams up with Ravi Babu for Aaviri

రెగ్యులర్‌ కమర్షియల్‌ పంథాకు భిన్నమైన ఇతివృత్తాలతో సినిమాలు చేస్తుంటారు రవిబాబు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ ఏ ఫ్లయింగ్‌ఫ్రాగ్స్‌ ప్రొడక్షన్‌ పతాకంపై స్వీయదర్శనిర్మాణంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘ఆవిరి’. ఈ చిత్రానికి దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. నేహాచౌహాన్‌, శ్రీముక్త, భరణిశంకర్‌ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘కామెడీ హారర్‌ థ్రిల్లర్‌ సినిమాల్ని తెరకెక్కించడంలో సిద్దహస్తుడిగా పేరుతెచ్చుకున్నారు రవిబాబు. ఈ నేపథ్యాలతో ఆయన చేసిన సినిమాలన్నీ పెద్ద విజయాల్ని సాధించాయి. ఆ కోవలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకముంది’ అని తెలిపారు. రవిబాబు మాట్లాడుతూ ‘దిల్‌రాజుతో సినిమా చేయాలని 15 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమాతో కుదిరింది. ఊహకందని మలుపులతో ఉత్కంఠను పంచే చిత్రమిది’ అని పేర్కొన్నారు. ముక్తార్‌ఖాన్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్‌:నారాయణరెడ్డి, కెమెరా: ఎన్‌.సుధాకర్‌రెడ్డి, సంగీతం: వైధి, స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌.

788

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles