డిస్కోరాజా హంగామా


Thu,September 5, 2019 12:08 AM

disco raja first look mass maharaja is flashy maharaja telugu news

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం డిస్కోరాజా. వి.ఐ.ఆనంద్ దర్శకుడు. పాయల్‌రాజ్‌పుత్, నభానటేష్, తాన్యాహోప్ కథానాయికలు. రజిని తాళ్లూరి నిర్మాత. డిసెంబర్ 20న విడుదలకానుంది. వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇటీవల ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ హైదరాబాద్, ఢిల్లీలోని విభిన్నమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం. గ్రాఫిక్స్‌కు పెద్దపీట వేసి రూపొందిస్తున్నాం. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుందీ చిత్రం అని అన్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. రవితేజ పాత్ర చిత్రణ నవ్యమైన పంథాలో ఉంటుంది. మాస్, క్లాస్ అంశాల కలబోతగా మెప్పిస్తుంది. డిస్కోరాజా చేసే హంగామా చక్కటి వినోదాన్ని పండిస్తుంది అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: తమన్, సంభాషణలు: అబ్బూరి రవి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.ఐ.ఆనంద్.

579

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles