ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ టీమ్ సారథ్యంలో..

Tue,September 17, 2019 12:10 AM

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం డిస్కోరాజా. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రజిని తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వి.ఐ. ఆనంద్ దర్శకుడు. పాయల్ రాజ్‌పుత్, నభానటేష్, తాన్యహోప్ కథానాయికలు. మంగళవారం నుంచి యూరప్‌లోని ఐస్‌లాండ్‌లో ప్రారంభమయ్యే తదుపరి షెడ్యూల్‌లో హాలీవుడ్ చిత్రం ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-7కు పనిచేసిన స్టంట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో భారీ పోరాట ఘట్టాల్ని చిత్రీకరించనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ గ్రాఫిక్స్ హంగులతో ముడిపడిన సైంటిఫిక్ థ్రిల్లర్ చిత్రమిది. రవితేజ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నది. మంగళవారం నుంచి ఐస్‌లాండ్‌లో కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించబోతున్నాం. నాలుగు నిమిషాల నిడివి ఉండే ఈ సన్నివేశాలకు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-7తో పాటు పలు హాలీవుడ్ చిత్రాలకు పోరాటాల్ని సమకూర్చిన ఉలి బృందం యాక్షన్ కొరియోగ్రఫీని అందించనున్నారు. ఈ సన్నివేశాల కోసం నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు ఖర్చుచేయనున్నాం. ఈ పోరాట ఘట్టాలు కొత్త అనుభూతిని పంచుతాయి. ఇటీవల పూర్తయిన షెడ్యూల్‌లో గోవాలో పదిహేను రోజుల పాటు కీలక ఘట్టాల్ని చిత్రీకరించాం అని తెలిపారు. బాబీసింహా, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, సినిమాటోగ్రఫీ: కార్తీక్‌ఘట్టమనేని.

563

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles