అక్టోబర్‌లో షురూ


Mon,September 9, 2019 10:49 PM

Dr Rajasekhar Pradeep Krishnamoorthy Film to go on the floors in October

రాజశేఖర్ హీరోగా క్రియేటివ్ ఎంటర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కనున్నది. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకుడు. జి.ధనుంజయన్ నిర్మించనున్నారు. అక్టోబర్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. రాజశేఖర్ మాట్లాడుతూ చక్కటి కథకు అద్భుతమైన స్క్రీన్‌ప్లే కుదిరింది. ఉత్కంఠ రేకెత్తిస్తూనే వినోదాన్ని పంచే చిత్రమిది. ఎమోషనల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం నవ్యమైన అనుభూతిని పంచుతుంది అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ హైదరాబాద్, చెన్నైలో చిత్రీకరణ జరుపుతాం. సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తిచేస్తాం. రాజశేఖర్ పాత్ర నవ్య పంథాలో ఉంటుంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. కథానాయికతో పాటు ఇతర నటీనటుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం అని తెలిపారు. సత్యరాజ్, నాజర్, బ్రహ్మానందం, సంపత్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి రచయిత: విశ్వ వేమూరి, స్క్రీన్‌ప్లే: జాన్ మహేంద్రన్, సంగీతం: సైమన్.కె.కింగ్.

294

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles