కాపీ కథ కాదు!


Thu,August 22, 2019 11:47 PM

Edaina Jaragochu movie dark comedy to leave fans in splits

దర్శకుడిగా నా ప్రతిభను నిరూపించుకోవాలనే తపనతో సొంతంగా ఈ కథ రాసుకున్నాను. ఏ సినిమాకు కాపీ కాదిది అని అన్నారు కె.రమాకాంత్. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ఏదైనా జరగొచ్చు. విజయ్‌రాజా, పూజా సోలంకి, సాషాసింగ్ నాయకానాయికలుగా నటించారు. వెట్‌బ్రెయిన్ ఎంటర్‌టైన్‌మెంట్స్, సుధర్మ్ ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మించాయి. నేడు ఈ చిత్రం విడుదలకానుంది. గురువారం హైదరాబాద్‌లో రమాకాంత్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ కాకతాళీయంగా ఏప్రిల్ ఒకటిన పుట్టిన ముగ్గురు అల్లరి యువకుల కథ ఇది. తెలివితక్కువ పనులతో తాము ఇబ్బందులు పడుతూనే ఎదుటివారిని కష్టాల్లో పడేస్తుంటారు. ఆ యువకులు తమ ప్రమేయం లేకుండానే ఓ సమస్యలో ఎలా చిక్కుకున్నారు? దాని నుంచి ఏ విధంగా బయటపడ్డారు? అన్నది ఆకట్టుకుంటుంది. డార్క్ కామెడీ కథాంశంతో ఈ సినిమాను రూపొందించాం. ఇందులో ప్రత్యేకంగా హీరో అంటూ ఎవరూ ఉండరు.

అన్ని పాత్రలకు సమాన ప్రాధాన్యత ఉంటుంది. శివాజీరాజా కొడుకు విజయ్‌రాజాను ఆడిషన్ ద్వారానే ఎంచుకున్నాం. తమిళ నటుడు బాబీసింహాపై తెరకెక్కించిన రస్టిక్ లవ్‌స్టోరీ కొత్తగా ఉంటుంది. దర్శకుడిగా ఇదే నా తొలి చిత్రం. చంద్రశేఖర్ ఏలేటి వద్ద అనుకోకుండా ఒకరోజుతో పాటు మరో రెండు సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. ప్రీప్రొడక్షన్, కథ, సాంకేతిక పరమైన అంశాల గురించి ఆయన వద్దే నేర్చుకున్నాను. చంద్రశేఖర్ ఏలేటి సినిమా చూసి బాగుందని ప్రశంసించారు. స్క్రీన్‌ప్లేను నమ్మే చంద్రశేఖర్ ఏలేటి సినిమాలు చేస్తుంటారు. ఆయన పంథానే నేను అనుసరించారు. యాక్షన్ జోనర్ సినిమాలంటే చాలా ఇష్టం. తదుపరి సినిమా యాక్షన్ ఇతివృత్తంతో తెరకెక్కించాలనే ఆలోచనతో ఉన్నాను అని తెలిపారు.

343

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles