చిరు పుట్టినరోజున..


Thu,August 22, 2019 11:41 PM

Gang Leader Racha Malli Modalaindi movie Teaser Release

మోహనకృష్ణ, హరిణిరెడ్డి జంటగా నటిస్తున్న చిత్రం గ్యాంగ్‌లీడర్. మళ్ళీ మొదలవుతుంది రచ్చ అనేది ఉపశీర్షిక. సీహెచ్ రవికిషోర్‌బాబు దర్శకత్వంలో సింగులూరి మోహన్‌రావు నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను గురువారం చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామి నాయుడు విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ చిరంజీవి సూపర్‌హిట్ సినిమా టైటిల్ కావడం వల్ల ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మెగా అభిమానులను అలరించే విధంగా చిత్రం ఉంటుంది అని తెలిపారు. మెగాస్టార్ అభిమానిగా.. ఆయన టైటిల్‌తో వస్తున్న సినిమాలో నటించడం ఆనందంగా వుందని కథానాయకుడు మోహనకృష్ణ తెలిపారు. సుమన్, తనికెళ్లభరణి, రంగస్థలం మహేష్, ఎల్‌బీ శ్రీరామ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: బండారు దానయ్య కవి, సమర్పణ: కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, మనీషా ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్.

393

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles