సరికొత్త ప్రేమకథ

Fri,November 15, 2019 12:06 AM

గౌతమ్‌వ్యాస్, దీపికా వధాని నాయకానాయికలుగా శ్రీ శివాయ్ ఫిలింస్ పతాకంపై తెరకెక్కుతున్న తాజా చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కె. రమేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్రవంతి మురళీమోహన్ దర్శకుడు. దర్శకుడు మాట్లాడుతూ ప్రేమ, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ అంశాల సమాహారంగా సాగే చిత్రమిది. హైదరాబాద్, గోవా, కేరళలలో చిత్రీకరణ జరుపుతాం. గౌతమ్‌వ్యాస్, మిస్ తెలంగాణ దీపికా వధానిలను ఈ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం చేస్తున్నాం. నలభై రోజుల్లో సినిమాను పూర్తిచేస్తాం అని తెలిపారు. హరీష్ ఉత్తమన్, అర్జున్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శివ నందిగామ, కెమెరా:జి.ఎస్.రాజ్.

306

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles