అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్‌లో..?


Mon,February 11, 2019 12:19 AM

Gautham Menon and Janhvi Kapoor to replace Bala and Megha Chowdhury in Arjun Reddy remake

సైరాట్ రీమేక్ ధడక్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ మరో రీమేక్ సినిమాలో నటించనుందని తెలిసింది. తెలుగులో సంచలన విజయం సాధించిన చిత్రం అర్జున్‌రెడ్డి. ఈ సినిమాను తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తమిళంలో విక్రమ్ తనయుడు ధృవ్‌ను హీరోగా పరిచయం చేస్తూ వర్మ పేరుతో రూపొందుతున్న రీమేక్‌ని చిత్ర బృందం రద్దు చేసింది. దర్శకుడు బాలకు, చిత్ర బృందానికి మధ్య సృజనాత్మక విబేధాల కారణంగా ఈ చిత్రాన్ని రద్దు చేస్తున్నామని, మరో దర్శకుడితో చిత్రాన్ని మళ్లీ కొత్తగా నిర్మిస్తామని చిత్ర నిర్మాతలు ఇటీవల ప్రకటించారు. ఈ చిత్రంలో షాలిని పాండే పోషించిన పాత్రలో జాన్వీ కపూర్, జియా శర్మ పాత్రలో మేఘా చౌదరి నటించనున్నట్లు తమిళ చిత్ర వర్గాల సమాచారం. ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ గౌతమ్ మీనన్ ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించే అవకాశం వుందని, ఇప్పటికే హీరో విక్రమ్ ఆయనను సంప్రదించారని, గౌతమ్ మీనన్ కూడా ఈ సినిమా విషయంలో సుముఖంగా వున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై చిత్ర బృందం అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

స్వచ్ఛందంగానే తప్పకున్నా - బాల

వర్మ సినిమా నుంచి స్వచ్ఛందంగానే తప్పుకున్నానని దర్శకుడు బాల పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు. చిత్ర నిర్మాతలతో సృజనాత్మకమైన విభేదాల కారణంగానే తాను ఈ సినిమా నుంచి తప్పకుంటున్నానని, ధృవ్ కెరీర్ దృష్ట్యా ఇంతకంటే ఈ విషయంపై ఏమీ మాట్లాడలేనని స్పష్టం చేశారు.

2831

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles