మహావృక్షంగా ఎదగాలి


Thu,September 5, 2019 12:08 AM

geethanjali telangana maa t maa team prathani ramakrishna goud telangana movie artist association

తెలంగాణ ఫిలింఛాంబర్ కేవలం తెలంగాణ ప్రాంతం వారికోసమే ఏర్పాటైందనే అపోహలున్నాయి. ప్రాంతీయ భేదాలతో సంబంధం లేకుండా అన్ని రాష్ర్టాల వారు ఇందులో సభ్యులుగా చేరవచ్చు అని అన్నారు తెలంగాణ ఫిలింఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్. ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(టీ మా) బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా జేవీఆర్, ఉపాధ్యక్షులుగా గీతాంజలి, బాలాజీ, దిలీప్ రాథోడ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ చిరుబీజంగా మొదలైన ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మహావృక్షంగా ఎదగాలి. తెలంగాణ ఫిలింఛాంబర్ ప్రారంభమై ఆరేళ్లవుతుంది. ఈ ప్రయాణంలో చిన్న సినిమాలకు ఎదురైన అనేక సమస్యల్ని పరిష్కరించాం. ప్రత్యేకంగా ఛాంబర్‌కోసం భవనాన్ని కట్టించడమే కాకుండా పేదకళాకారులకు ఇళ్లను నిర్మించే ఆలోచనలో ఉన్నాం. ప్రభుత్వం పేదకళాకారులకు సహాయపడుతుందనే నమ్మకం ఉంది అని తెలిపారు.తెలంగాణ కోసం ప్రత్యేక ఫిలింఛాంబర్‌ను ఏర్పాటుచేయాలని చాలా మంది ప్రయత్నించినా ఆర్.కె.గౌడ్ మాత్రమే ఈ స్వప్నాన్ని నిజం చేశారని గురురాజ్ చెప్పారు.కళాకారులకు అవకాశాలు వచ్చేలా కృషిచేస్తూనే తమ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తామని జేవీఆర్ అన్నారు.ఈ కార్యక్రమంలో స్నిగ్ధ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

472

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles