తెలంగాణ, ఆంధ్ర కబడ్డీ కథ

Thu,October 3, 2019 11:02 PM

గోపీచంద్ కథానాయకుడిగా సంపత్‌నంది దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తమన్నా కథానాయిక. శ్రీనివాసా సిల్వర్‌స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి బోయపాటి శ్రీను క్లాప్‌నివ్వగా, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్ కెమెరా స్విఛాన్ చేశారు. గోపీచంద్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ నిర్మాతలతో ఎప్పటినుంచో పరిచయం ఉంది. చాలా కథలు అనుకున్నాం. ఇది పర్‌ఫెక్ట్‌గా కుదిరింది. గౌతమ్‌నందా తర్వాత సంపత్‌నందితో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ప్రేక్షకులకు నవ్యానుభూతిని పంచే కథ ఇది అన్నారు. క్రీడానేపథ్య కథాంశమిది. దీనికోసం చాలా పరిశోధన చేశాను. ఈ సినిమాలో ఆంధ్రా మహిళా కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ మహిళా కబడ్డీ కోచ్‌గా తమన్నా నటిస్తున్నారు. 25 మంది ప్లేయర్స్ కనిపిస్తారు. బలమైన కథతో భావోద్వేగప్రధానంగా సాగే సినిమా ఇది అని దర్శకుడు తెలిపారు. సంపత్‌నంది దర్శకత్వంలో తాను నటిస్తున్న మూడో చిత్రమిదని, హృదయాన్ని స్పృశించే ఎమోషన్స్ ఉంటాయని తమన్నా చెప్పింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సౌందర్‌రాజన్, ఆర్ట్: రాజీవ్‌నాయర్, సమర్పణ: పవన్‌కుమార్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంపత్‌నంది.

498

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles