హాలీవుడ్‌లో అరంగేట్రం

Mon,September 23, 2019 12:31 AM

దక్షిణాదిలో సంగీత దర్శకుడిగా తనదైన ముద్రను వేశారు జీవీ ప్రకాష్‌కుమార్‌. ఆ తర్వాత తమిళ చిత్రం ‘డార్లింగ్‌'తో హీరోగా కెరీర్‌ ప్రారంభించారు. ‘నాచియార్‌' ‘సర్వం తాళమయం’ నటుడిగా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. తాజాగా ఆయన హాలీవుడ్‌లో అరంగేట్రం చేయబోతున్నారు. ‘ట్రాప్‌సిటీ’ పేరుతో రూపొందించనున్న సినిమాలో జీవీ ప్రకాష్‌ కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలిసింది. రికీ బర్చెల్స్‌ దర్శకుడు. యాక్షన్‌ ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం జీవీ ప్రకాష్‌ ‘అసురన్‌' ‘సురారైపొట్రు’ వంటి భారీ చిత్రాలకు సంగీతాన్నందిస్తున్నారు.

558

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles