లాయర్ అవుదామనుకున్నా!

Thu,November 14, 2019 12:07 AM

తెలుగు, తమిళం అనే భాషాభేదాలు నాకు లేవు. ఏ భాషలోనైనా మంచి సినిమాతో ప్రేక్షకుల్ని అలరించడమే నటిగా నా బాధ్యత అని చెప్పింది హన్సిక. రెండేళ్ల విరామం తర్వాత తెనాలిరామకృష్ణ బీఏబీఎల్ చిత్రంతో తెలుగులో కథానాయికగా పునరాగమనం చేస్తున్నదామె. ఈ నెల 15న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో హన్సిక పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి..


తెనాలి రామకృష్ణలో మీ పాత్ర ఎలా ఉంటుంది?

-పెద్ద న్యాయవాదిగా పేరుతెచ్చుకోవాలని కలలు కనే పాత్ర నాది. కానీ వాస్తవంలో మాత్రం ఆ స్వప్నాన్ని నెరవేర్చుకోలేక విఫలమవుతుంటాను. తెనాలి రామకృష్ణ అనే లాయర్‌తో పరిచయం ఆమె జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పిందన్నది ఆకట్టుకుంటుంది.

ఈ సినిమాలో మీకు నచ్చినదేమిటి?

-నాకు నేను బాగా నచ్చాను(నవ్వుతూ).కథే ఈ సినిమాకు అసలైన హీరో. సగటు ప్రేక్షకురాలిగా నేను కామెడీ సినిమాల్ని ఎంజాయ్ చేస్తుంటాను. ఇది అలాంటి సినిమానే.

కెరీర్‌లో ఎక్కువగా ఇద్దరు హీరోయిన్ల సినిమాలు చేస్తున్నారు?ఎందుకలా?

-ఇది ఇద్దరు హీరోయిన్లు ఉన్న సినిమా కాదు. నా క్యారెక్టర్‌తో పోలిస్తే వరలక్ష్మి శరత్‌కుమార్ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుంది. సినిమాలో నాతో పాటు మరొకరు నటిస్తున్నారా, నాపై ఆధిపత్యం చెలాయిస్తారా అనే అభద్రతాభావం, అసూయతో ఎప్పుడూ ఉండను. ఆత్మవిశ్వాసంతో నాకు అప్పగించిన పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను.

గౌతమ్‌నందా తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు?కారణమేమిటి

-తమిళ చిత్రాలతో బిజీగా ఉండటంతో రెండేళ్లుగా తెలుగులో సినిమాలకు దూరమయ్యాను. నా డేట్స్ అందుబాటులో ఉండి, మంచి కథ కుదిరితే తెలుగులో సినిమాలు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ సినిమా విషయంలో నా డేట్స్ కోసం దర్శకుడు నాగేశ్వరరెడ్డి చాలా రోజులు ఎదురుచూశారు.

లాయర్ పాత్ర కోసం ఎలాంటి పరిశోధన చేశారు?

-మా అన్నయ్య బెస్ట్‌ఫ్రెండ్ ఒకరు లాయర్‌గా పనిచేస్తున్నారు. అతడికి ఎప్పుడూ ఫోన్ చేసినా కోర్టులో బిజీగా ఉన్నానని చెప్పేవాడు. అవన్నీ గుర్తుచేసుకుంటూ నా పాత్రలో ఒదిగిపోయా. కేసులు, సెక్షన్‌లు ఇలా న్యాయశాస్ర్తానికి సంబంధించిన పదాలన్నీ సినిమాతో నాకు అనుభవంలోకి వచ్చాయి. ఒకవేళ నేను నటిని కాకపోయుంటే తప్పకుండా లాయర్ అయ్యేదాణ్ణి. చిన్నతనంలో ఆ కోరిక ఉండేది.

తమిళ చిత్రం మహాలో విలన్‌గా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి?

-భిన్న పార్శాలతో ఆ సినిమాలో నా పాత్ర సాగుతుంది. డ్రీమ్‌రోల్ లాంటి పాత్రను చేస్తున్నాను.
-గత ఐదారేళ్లుగా వర్కవుట్స్ ద్వారా బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నాను. స్కాష్ బాగా ఆడుతున్నాను. అది బరువు తగ్గడానికి ఉపయోగపడుతున్నది.
-భాగమతి ఫేమ్ అశోక్ దర్శకత్వంలో తెలుగులో ఓ వెబ్‌సిరీస్ చేస్తున్నాను. నేను అంగీకరించిన తొలి వెబ్ సిరీస్ ఇది. మహిళా ్రప్రధాన కథాంశంతో థ్రిల్‌ను పంచుతుంది. నేటి యువతరం జీవనశైలి ప్రధానంగా సాగుతుంది. కథాగమనం అంతా రాత్రుల్లోనే ఉంటుంది. మరో మూడు రోజులు మినహా చిత్రీకరణ పూర్తయింది.వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ వెబ్‌సిరీస్ ప్రసారంకానున్నది.

972

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles