జ్వాలాముఖి గీతాలు

Thu,November 7, 2019 11:17 PM

వైఎఫ్ క్రియేటివ్స్ సంస్థ నిర్మించిన చిత్రం జ్వాలాముఖి. హరిశంకర్ మట్టగుంట దర్శకుడు. యూసఫ్ యం.డి నిర్మాత. ఈ చిత్ర గీతావిష్కరణ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభిన్న కథా చిత్రమిది. కథానుగుణంగా చక్కటి సంగీతం కుదిరింది. తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. చిన్న సినిమాలకు ఏమైన సమస్యలున్నాయని తెలిస్తే మా తరపున సహకారం అందిస్తాం అన్నారు. సినిమాలన్నీ ఒకటే అని..చిన్న పెద్ద తేడాలు లేవని నిర్మాత గురురాజ్ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కిరీటి, సంగీతం: రాజ్‌కిరణ్, సాహిత్యం: గురుచరణ్.

184

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles