కియారా కోలీవుడ్ ఎంట్రీ..


Thu,August 8, 2019 12:24 AM

Kabir Singh star Kiara Advani to Vijay

కబీర్‌సింగ్ చిత్రంతో కెరీర్‌లో పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నది కియారా అద్వాణీ. ప్రీతి పాత్రలో సహజనటనతో ఆకట్టుకున్నది. ఈ సక్సెస్‌తో బాలీవుడ్‌లో బిజీగా మారిపోయింది. గత ఏడాది విడుదలైన భరత్ అనే నేనుతో తెలుగులో అరంగేట్రం చేసిన కియారా అద్వాణీ తాజాగా కోలీవుడ్‌లో తొలి అడుగు వేయబోతున్నది. విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్నది. సామాజిక ఇతివృత్తానికి యాక్షన్ అంశాలను మేళవిస్తూ రూపొందనున్న ఈ చిత్రంలో విజయ్‌కి జోడీగా కియారా అద్వాణీ నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న, కీర్తిసురేష్‌తో పాటు పలువురు నవనాయికల పేర్లు వినిపించాయి. చివరకు ఈ అవకాశం కియారా అద్వాణీని వరించినట్లు చెబుతున్నారు.

397

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles