కథలున్నాయి.. దర్శకత్వం చేస్తా!


Mon,August 12, 2019 11:25 PM

kalyani priyadarshan for ranarangam iam growing with each film

హలో చిత్రలహరి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మలయాళీ సోయగం కల్యాణి ప్రియదర్శన్. చూడచక్కనిరూపం, అభినయంతో యువతరాన్ని మెప్పించింది. ఆమె కథానాయికగా నటించిన తాజా చిత్రం రణరంగం. శర్వానంద్ కథానాయకుడు. సుధీర్‌వర్మ దర్శకుడు. ఈ నెల 30 విడుదలకానుంది. ఈ సందర్భంగా కల్యాణి ప్రియదర్శన్ మాట్లాడుతూ ఈ కథ వింటున్నప్పుడే స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా అనిపించింది. గతాన్ని, వర్తమానాన్ని స్పృశిస్తూ కథాగమనం అనేక మలుపులతో ఆసక్తిని రేకెత్తించింది. ఓ వ్యక్తి జీవితానికి దర్పణంలా ఈ చిత్ర కథ తీవ్రమైన భావోద్వేగాల కలబోతగా సాగుతుంది. సినిమాలో నా పాత్ర పేరు గీత. పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తాను. కథానాయకుడు జీవితంలోకి గీత ఎలా ప్రవేశించింది? ఎంత బలంగా అతన్ని ప్రభావితం చేసిందనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. 90వ దశకంలో కథలో కొంతభాగం జరుగుతుంది. అలనాటి కథానాయికల సినిమాలను పరిశీలించి నా పాత్ర విషయంలో పరిపూర్ణత ప్రదర్శించడానికి ప్రయత్నించాను.

ఈ సినిమా కోసం నా జీవితంలో తొలిసారి వోణి కట్టాల్సివచ్చింది. హాఫ్‌సారీలో నేను చాలా అందంగా ఉన్నానని అమ్మనాన్న మెచ్చుకున్నారు. ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్స్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు అందమైన ప్రేమకథ కూడా ఉంటుంది. . నాకు స్వతహాగా గ్యాంగ్‌స్టర్ సినిమాలంటే ఇష్టం. అందుకే ఈ కథతో బాగా కనెక్ట్ అయ్యాను. నా గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమాలో నేను పరిణితి కలిగిన అమ్మాయి పాత్రను పోషించాను. అయితే వ్యక్తిత్వపరంగా ఇప్పటికీ నేను చిన్నపిల్లనే (నవ్వుతూ). సినిమాల విషయంలో నేను సెలెక్టివ్‌గా ఉంటాను. కథలో కొత్తదనం ఉంటేనే అంగీకరిస్తాను. మనసులో కొన్ని కథలు అనుకున్నా. అవకాశం వస్తే భవిష్యత్తులో దర్శకత్వం చేసే ఆలోచన ఉంది అని చెప్పింది.

572

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles