అబ్దుల్ రహీమ్ బయోపిక్‌లో..


Thu,March 14, 2019 10:45 PM

Keerthy Suresh to debut in Bollywood opposite Ajay Devgn

సావిత్రి జీవిత కథా చిత్రం మహానటిలో ప్రేక్షకుల్ని మెప్పించింది కీర్తిసురేష్. తాజాగా ఆమె మరో బయోపిక్‌లో నటించబోతున్నది. 1956 ఒలింపిక్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టును సెమీఫైనల్‌కు చేర్చి చరిత్రను సృష్టించిన హైదరాబాద్‌కు చెందిన ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితకథ ఆధారంగా బాలీవుడ్‌లో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. రహీమ్ కోచ్‌గా ఉన్న 1950 నుంచి 1963 కాలాన్ని భారత ఫుట్‌బాల్ చరిత్రలో స్వర్ణయుగంగా చెబుతుంటారు. రహీమ్ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ అమిత్‌శర్మ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో టైటిల్ పాత్రలో అజయ్‌దేవ్‌గన్ నటిస్తున్నారు. ఆయన భార్యగా కీర్తిసురేష్ నటిస్తున్నది. బోనీకపూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. గొప్ప చరిత్రలో భాగం కావడం గర్వంగా ఉంది. భాషాప్రాంతాలతో సంబంధం లేకుండా దేశ కీర్తిప్రతిష్టల్ని ఇనుమడింపజేసిన మహా వ్యక్తి కథ ఇది అని కీర్తిసురేష్ తెలిపింది. జూన్ నుండి ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది.

1387

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles