జీవితం ఆట కాదు!


Mon,September 9, 2019 03:37 AM

Khel movie First Look Release

రాఘవసాయి, నాగబాబు, చాణక్య, స్నేహాల్ కామత్, మమతారెడ్డి, దీక్ష నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ఖేల్. లైఫ్ ఈజ్ నాట్ ఏ గేమ్ ఉపశీర్షిక. మాన్సీ మూవీస్ పతాకంపై గ్లోబల్ మోషన్ పిక్చర్స్ సమర్పణలో గొట్టిముక్కల పాండురంగారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరత్‌కుమార్.ఆర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎంఎల్‌సీలు పట్నం మహేందర్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి సంయుక్తంగా విడుదలచేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ను సినీ హబ్‌గా తీర్చిదిద్దడంతో పాటు సినిమా చిత్రీకరణలు, నిర్మాణానంతర కార్యక్రమాలకు సంబంధించిన మౌలిక సదుపాయాల్ని కల్పించి చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆహుతులు పేర్కొన్నారు. వినూత్న కథాంశంతో రూపొందుతున్న ఖేల్ సినిమా పెద్ద విజయాన్ని సాధించి చిత్రబృందానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు యు.సత్యనారాయణ, కూకట్‌పల్లి ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సాయికిరణ్, వెంకట్ బోనాలతో పాటు పలువురు కీలక పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అమర్ సాధనాల, ఎడిటింగ్: సేవియర్ అలోషియస్, పాటలు: వంశీకృష్ణ, నాగిరెడ్డి లింగారెడ్డి, సంగీతం: ఆనంద్ అవసరాల, సహనిర్మాత: పులి అమృత్‌గౌడ్.

392

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles