చారిత్రక కథాంశంతో మామాంగం

Sat,October 5, 2019 12:05 AM

భారతదేశ సంస్కృతి విశిష్టమైనది. భాషలు మనల్ని విభజిస్తాయి. కానీ భాష వల్ల మన చరిత్ర ఇతరులకు తెలియకుండా పోకూడదు. అన్ని భాషల ప్రేక్షకుల్ని ఏకం చేస్తూ కేరళ రాష్ట్ర చరిత్రలోని ఒక అద్భుతమైన కథతో ఈ సినిమాను రూపొందించాం అని అన్నారు మమ్ముట్టి. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం మామాంగం. ఎం. పద్మకుమార్ దర్శకుడు. కావ్య ఫిల్మ్ కంపెనీ పతాకంపై వేణు కున్నపిళ్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 21న ఈ చిత్రం విడుదలకానుంది. దర్శకుడు మాట్లాడుతూ 1695లో జరిగిన యథార్థ గాథ ఆధారంగా సినిమాను రూపొందిస్తున్నాం. జామోరిన్ పాలనలోని చావెరుక్కళ్ యుద్ధవీరుల కథ ఇది. జామోరిన్‌ను చావెర్స్ ఎలా చంపారన్నది ఆసక్తిని పంచుతుంది. ప్రాచీన యుద్ధవిద్య కలరి విశిష్టతను చాటిచెబుతుంది. మమ్ముట్టి విభిన్నమైన పాత్రలో కనిపిస్తారు. యాక్షన్ సన్నివేశాలు ఉత్కంఠభరితంగా ఉంటాయి అని చెప్పారు. టీజర్‌కు చక్కటి స్పందన లభిస్తున్నదని నిర్మాత పేర్కొన్నారు. ప్రాచి తెహలాన్, ఉన్ని ముకుందన్, మోహన్‌శర్మ, సితార, ప్రాచీదేశాయ్, మాళవికా మీనన్.

759

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles