రాజా నరసింహ సందేశం

Wed,November 6, 2019 12:17 AM

మమ్ముట్టి కథానాయకుడిగా నటించిన మలయాళ చిత్రం మధురరాజా. వైశాఖ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగులో రాజా నరసింహ పేరుతో అనువాదమవుతోంది. జై చెన్నకేశవ పిక్చర్స్ పతాకంపై సాధుశేఖర్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. జై, మహిమా నంబియార్ కీలక పాత్రధారులు. ఈ చిత్ర ట్రైలర్‌ను మంగళవారం దర్శకుడు వి.వి.వినాయక్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ట్రైలర్ శక్తివంతంగా ఉంది. మలయాళంలో వంద కోట్లకుపైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకముంది అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ సందేశాత్మక కథాంశంతో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. మమ్ముట్టి పాత్ర చిత్రణ వైవిధ్యంగా ఉంటుంది. ప్రతినాయకుడిగా జగపతిబాబు నటించారు. సన్నీలియోన్‌పై చిత్రీకరించిన ప్రత్యేక గీతం అలరిస్తుంది. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 22న సినిమాను విడుదల చేయనున్నాం అని తెలిపారు.

388

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles