మనసుకు నచ్చినట్లుగా

Thu,October 3, 2019 12:09 AM

‘చిత్రసీమలో పేరుప్రఖ్యాతులకు అనుగుణంగా మనల్ని అభిమానించేవారితో పాటు శత్రువులు పెరుగుతారు. అవకాశం దొరికితే అధఃపాతాళానికి అణిచివేయాలని చూస్తుంటారు. స్వీయవ్యక్తిత్వాన్ని కోల్పోకుండా నమ్మిన విలువలకు కట్టుబడి పోరాటం చేసినప్పుడే వారిని ఎదుర్కోగలం’ అని అంటోంది కంగనా రనౌత్‌. సుదీర్ఘసినీప్రయాణంలో తనకు ఎదురైన ఆటుపోట్లను గురించి కంగనా రనౌత్‌ మాట్లాడుతూ ‘ఇన్నేళ్లు చిత్రసీమలో నిలదొక్కుకుంటానని ఎవరూ అనుకోలేదు. కొన్ని సినిమాతోనే నా ప్రయాణం ఆగిపోతుందని భావించారు. నా ఎదుగుదలను చూసి చాలా మంది అసూయ చెందారు. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా ముందడుగు వేయాలి, ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలనే విషయంలో స్పష్టతతో ఆలోచిస్తాను. ఎవరికి భయపడకుండా ధైర్యంగా ఆ సవాళ్లను స్వీకరిస్తాను. ఆ తత్వమే సినిమాల్లో, జీవితంలో నాకు విజయాల్ని తెచ్చిపెట్టింది. ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలంటే అందరికి నచ్చేలా ఉండాలనే నియమమేదీ లేదు. ఎదుటివారు నా గురించి ఏమనుకుంటున్నారనేది పట్టించుకోకుండా నా మనసుకు నచ్చినట్లుగా నేనుంటాను’ అని తెలిపింది.

462

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles