మంచోడి వినోదాలు

Thu,October 3, 2019 10:44 PM

మంచోడు అనే ఇమేజ్‌ను కాపాడుకోవడానికి ప్రతి మనిషి ప్రయత్నిస్తుంటాడు. ఆ ఇమేజ్‌ను డామేజ్ చేసే చిన్న తప్పును సరిదిద్దుకునే క్రమంలో ఓ యువకుడికి ఎదురైన సరదా సంఘటనల సమాహారమే ఈ చిత్రం అని అన్నారు విజయ్ దేవరకొండ. ఆయన నిర్మాతగా మారి వర్ధన్ దేవరకొండతో కలిసి రూపొందిస్తున్న చిత్రం మీకు మాత్రమే చెప్తా. తరుణ్‌భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్, వాణిభోజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. షమ్మీర్ సుల్తాన్ దర్శకుడు. నవంబర్ 1న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్మాత వర్ధన్ దేవరకొండ మాట్లాడుతూ యువతరాన్ని ఆలరించే వినోదభరిత కథాంశమిది. ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి సన్నివేశం నవ్విస్తుంది. ఇటీవల విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన లభిస్తున్నది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశలో ఉన్నాయి అని తెలిపారు. పావని గంగిరెడ్డి, నవీన్‌జార్జ్, అవంతికా మిశ్రా, వినయ్‌వర్మ, జీవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ:మదన్ గుణదేవా, సంగీతం:శివకుమార్, కళా దర్శకత్వం: రాజ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనురాగ్ పర్వతనేని.457

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles