మేరాదోస్త్ గీతాలు!


Mon,August 12, 2019 12:12 AM

mera dost movie songs release

పవన్, శైలజ జంటగా నటిస్తున్న చిత్రం మేరాదోస్త్. జి. మురళి దర్శకుడు. వి.ఆర్. ఇంటర్నేషనల్ పతాకంపై వీరారెడ్డి నిర్మించారు. వి.సాయిరెడ్డి సంగీతం అందించిన ఈ చిత్ర గీతాలు ఇటీవల హైదరాబాద్‌లో రాష్ట్ర వాటర్ బోర్డు ఛైర్మన్ వి. ప్రకాష్, డిజిక్వెస్ట్ బసిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్ సంయుక్తంగా విడుదల చేశారు. అనంతరం వి.ప్రకాష్ మాట్లాడుతూ సినిమా అంటే నాకు చిన్నతనం నుంచి ఆసక్తి. ఆరవ క్లాస్ నుంచే సినిమాలు విపరీతంగా చూసేవాడిని. అల్లాణి శ్రీధర్‌వద్ద దర్శకత్వ శాఖలో పలు చిత్రాలకు పనిచేశాను. ఆ తరువాత అనుకోకుండానే రాజకీయాల్లోకి ప్రవేశించాను. వీరారెడ్డి ఇరవైఏళ్లుగా తెలుసు. పాటలు బాగున్నాయి. సినిమా సక్సెస్ సాధించాలి అన్నారు. డైనమిక్ అమ్మాయి ఓ బలహీనుడిని ప్రేమిస్తుంది. ఇలాంటి క్రమంలో ఆ అమ్మాయిని ఒక రాక్షసుడు ఎత్తుకెళతాడు. అతని భారీ నుంచి ఓ మిత్రుడు ఆమెను ఎలా కాపాడాడు అన్నదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. ప్రేమ, స్నేహం భావనలకు అందమైన దృశ్యరూపంలా సాగుతుంది. నటీనటులు కొత్తవారైన చక్కటి నటనను కనబరిచారు అన్నారు. ఈ కార్యక్రమంలో పవన్, శైలజ తదితరులు పాల్గొన్నారు.

193

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles