మురికివాడ సందేశం


Tue,August 6, 2019 12:51 AM

murikivaada movie shooting starts

విజయ్, ఆశ రాథోడ్, మధుప్రియ, ప్రేమ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం మురికివాడ. పాలిక్ దర్శకుడు. తిరుపతి పటేల్, రామ్, భాను, నీలిమ నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్‌నివ్వగా, సాయివెంకట్ కెమెరా స్విఛాన్ చేశారు. రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ మురికివాడ నేపథ్యంలో సాగే చిత్రమిది. స్నేహం, ప్రేమ అంశాలకు చక్కటి సందేశాన్ని జోడించి రూపొందిస్తున్నాం. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం అని తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ మూడు షెడ్యూల్స్‌లో పూర్తిచేస్తాం. ఐదు పాటలుంటాయి. ఈ సినిమాతో కొత్త నాయకానాయికల్ని చిత్రసీమకు పరిచయం చేస్తున్నాం అని పేర్కొన్నారు. నటనకు ఆస్కారం ఉన్న మంచి పాత్రను పోషిస్తున్నానని హీరో విజయ్ అన్నారు. అశోక్‌కుమార్, గీతాసింగ్ తదితరులు చిత్ర తారాగణం.

158

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles