ఇంజినీరింగ్ లవ్‌స్టోరీ

Sun,November 17, 2019 10:44 PM

కృష్ణ, కిరణ్ చత్వాని జంటగా నటిస్తున్న చిత్రం నా మాటే వినవా. లింగస్వామి వేముగంటి దర్శకుడు. శంకర్‌గౌడ్ నిర్మాత. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శనివారం హైదరాబాద్‌లో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చైర్మన్ మోహన్ వడ్లపట్ల విడుదలచేశారు. దర్శకుడు మాట్లాడుతూ నేను దర్శకత్వం వహిస్తున్న తొమ్మిదో చిత్రమిది. యూత్‌ఫుల్‌ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాం. ఇంజినీరింగ్ చదివే ఓ జంట కథ ఇది. నిశ్చితార్థం తర్వాత వారి జీవితంలో ఎదురైన పరిణామాలేమిటన్నది చిత్ర ఇతివృత్తం అని తెలిపారు. అరకులోయ, మలేషియాలో నాలుగు పాటల్ని చిత్రీకరించామని హీరో కృష్ణ అన్నారు.

193

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles